టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ సినిమాల ఎఫెక్ట్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి బి గోపాల్ , మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా వద్దన్నాడట. అసలు ఏం జరిగింది ..? అనే వివరాలను తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో అశ్వినీ దత్ ఓ మూవీ ని రూపొందించాలి అనుకున్నాడట. ఇదే విషయాన్ని గోపాల్ కి చెప్పాడట. ఆయన కూడా ఓకే అన్నాడట. ఇక ఆ తర్వాత అశ్వినీ దత్ , చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది ... అది వినండి. అది నచ్చితే చిరంజీవితో మన కాంబోలో సినిమా చేద్దాం అని అన్నాడట. దానితో ఆయన చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథను విన్నాడట. కథ విన్నాక ఆయన దగ్గర ఉన్న కథ గోపాల్ కి నచ్చకపోవడంతో సినిమా చేయను అని చెప్పాడట. ఈ విషయం పరుచూరి గోపాలకృష్ణకు తెలిసిందట. దానితో ఆయన ఎందుకు మీరు చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో చిరంజీవితో సినిమా చేయను అన్నారు అని అడిగాడట. దానితో గోపాల్ నేను ఇప్పటికే బాలకృష్ణ గారితో సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను. చిన్ని కృష్ణ నాకు వినిపించిన కథ కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంది. అలాగే ఆ రెండు కథలకు కాస్త దగ్గర గానే ఉంది. మరోసారి నేను ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తే అది ప్రేక్షకుల ఆకట్టుకుంటుందో లేదో అందుకే నేను చిరంజీవితో ఆ కథతో సినిమా చేయను అన్నాను అని చెప్పాడట. దానితో ఆయన నువ్వు బాలకృష్ణతో ఫ్యాక్షన్ సినిమా చేశావు ... చిరంజీవితో కాదు. చిరంజీవితో ఫ్యాక్షన్ సినిమా చెయ్యి ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్నాడట. దానితో ఆయన కన్విన్స్ అయ్యే చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో చిరంజీవి హీరోగా అశ్విని దత్ బ్యానర్లో ఇంద్ర అనే మూవీని రూపొందించాడట. ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.