ప్రియుడితో తమన్నా పంచాయితీ.. రంగంలోకి ఆ హీరోయిన్‌ ?

Veldandi Saikiran
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ చిన్నది సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటన, అందంతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. ఈ చిన్నది తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరిగా నిలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, ఈ చిన్నది ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది.

అయితే ఈ బ్యూటీ ఇప్పటివరకు వివాహం చేసుకోకపోవడం నిజంగా బాధాకరం. కానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయవర్మతో ఈ చిన్నది రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా గతంలోనే ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తమన్న కూడా వారి ప్రేమ విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లడం, షాపింగ్ కి వెళ్లడం, వెకేషన్ కి వెళ్లిన సమయంలో కెమెరా కంట అనేకసార్లు పడ్డారు. అయితే ఈ జంట త్వరలోనే వివాహం చేసుకుంటామని రీసెంట్ గానే వెల్లడించారు. అయితే ఏమైందో తెలియదు గత కొన్ని రోజుల నుంచి తమన్న, విజయవర్మ బ్రేకప్ చెప్పుకున్నారని అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఈ వార్తలపై తమన్న, విజయవర్మ స్పందించకపోవడం నిజంగా బాధాకరం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు అసలు విషయాన్ని బయట పెట్టాలని చాలామందికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ నిన్న జరిగిన హోలీ సెలబ్రేషన్స్ లో తమన్నా, విజయవర్మ వేరువేరుగా హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంట్లో జరిగిన హోలీ వేడుకలలో వీరిద్దరూ హాజరయ్యారు.

కానీ ఇద్దరు కలిసి రాలేదు. విడివిడిగా వచ్చి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి బయట అలా కనిపించారు మరి ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ కలిపి జరుపుకున్నారా లేదా అనే సందేహంలో అభిమానులు ఉన్నారు. ఈ వార్తలపై ఎవరో ఒకరు స్పందిస్తే గాని వీరి బ్రేకప్ వార్తలకు ముగింపు పలకదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: