నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే హిట్ ప్రంచేజీలో వచ్చిన హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలను సాధించి ఉండడంతో హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నాని హీరో గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు.
అవి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇలా ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి భారీ ఓ టి టి డీల్ జరిగినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ ఓ టి టి సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి సంస్థ ఓ టి టి హక్కులను ఏకంగా 54 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే నాని ప్రస్తుతం హిట్ 3 మూవీ తో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు.
ఇప్పటికే నాని , శ్రీకాంత్ కాంబోలో రూపొందిన దసరా మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రస్తుతం నాని నటిస్తున్న హిట్ 3 , ది ప్యారడైజ్ మూవీపై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ రెండు మూవీలతో నాని ఏ స్థాయి విజయాలను అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.