సీమ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న టాలీవుడ్ హీరోలు.. ఏం జరిగిందంటే?

frame సీమ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న టాలీవుడ్ హీరోలు.. ఏం జరిగిందంటే?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీకి కలిసొచ్చిన బ్యాక్ డ్రాప్ లలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. టాలీవుడ్ యంగ్ హీరోలలో చాలామంది హీరోలు ప్రస్తుతం సీమ బ్యాక్ డ్రాప్ పై దృష్టి పెట్టడం గమనార్హం. సీమ బ్యాక్ డ్రాప్ సినిమాల గురించి సీమ సింహాలు వేటకొస్తున్నాయి అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాన్, విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా కాంబినేషన్లలో తెరకెక్కుతున్న సినిమాలు రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలే కావడం గమనార్హం. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఒక మూవీలో నటిస్తున్నారు.
 
అఖిల్ మురళీ కిషోర్ కాంబో మూవీ సైతం తిరుపతి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. సాయితేజ్ రోహిత్ కేపీ డైరెక్షన్ లో సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ సైతం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీమ బ్యాక్ డ్రాప్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగడం పక్కా అని చెప్పవచ్చు. టాలీవుడ్ హీరోలు ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్లు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి. టాలీవుడ్ స్టార్స్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. టాలీవుడ్ హీరోలు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: