
కుంభమేళా సన్యాసి ఏమైంది ఎక్కడికి పోయింది.. అసలు మేటర్ ఇదే..?
గతంలో తన అంద చందల తో యువత మతులు చెడగొట్టి నటి మమతా కూలకర్ణి ... దాదాపు పాతి కేళ్ల తర్వాత ఇండియా కి వచ్చిన ఈ నటి కుంభమేళా లో సందడి చేసిన విషయం తెలిసిందే .. త్రివేణి సంగమంలో మునిగి ఆమె సాధువు గా మారిపోయింది .. కిన్నార్ అఖాడ సంస్థ ఆమె ను సన్యాసి గా మార్చి మహా మండలేశ్వర్ అనే బిరుదు కూడా ఇచ్చేసింది . అయితే ఆ వెంటనే అఖాడ లో గొడవలు కూడా మొదలయ్యాయి . అమె ను ఎలా యోగినీ గా మారుస్తార ని పైగా బిరుదు అలా ఇస్తారంటూ గొడవలు గట్టిగా జరిగాయి ..
దీంతో అఖాడ లో కొందరు పదవుల కి కూడా రాజీనామాలు చేయాల్సి వచ్చింది .. ఆ తర్వాత మమత కులకర్ణి కి ఇచ్చిన బిరుదు ను కూడా వెనక్కి తీసేసుకున్నారు .. అంతే కాకుండా ఆమెను అఖాడ లో చేర్చు కోవడానికి కూడా నో చెప్పారు . ఇదంతా కుంభమేళా టైంలో జరిగిన విషయం .. మరి ఇంత జరిగిన తర్వాత కూడా మమతా కులకర్ణి ఇప్పుడు ఎక్కడ ఉంది .. ఏం చేస్తుంది .. గత కొన్ని రోజుల పాటు ముంబాయి లో కనిపించిన ఈ 52 సంవత్సరాల హీరోయిన్ ... ఇప్పుడు మరోసారి విదేశాల కు వెళ్లి పోయినట్టు తెలుస్తుంది .. ఇక ఈసారి ఆమె తిరిగి భారత్ లో అడుగు పెట్టే అవకాశం లేద ని కూడా ఆమె సన్నిహితులు అంటున్నారు ..