అదే పౌరుషం.. అదే రోషం.. తగ్గేదేలే.. హీరోయిన్ విజయశాంతి కామెంట్స్ వైరల్!

frame అదే పౌరుషం.. అదే రోషం.. తగ్గేదేలే.. హీరోయిన్ విజయశాంతి కామెంట్స్ వైరల్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయశాంతికి నటిగా ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. విజయశాంతి తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో విజయశాంతి మరోసారి బాక్సాఫీస్ వద్ద లక్ పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో విజయశాంతి మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
 
కర్తవ్యం సినిమాలోని వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా అని కళ్యాణ్ రామ్ తెలిపారు. ఈ సినిమాకు అమ్మ బిగ్గెస్ట్ పిల్లర్ అని కళ్యాణ్ రామ్ అన్నారు. విజయశాంతి ఈ సినిమాలో డూప్స్ లేకుండా అద్భుతంగా స్టంట్స్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా మరో 20 సంవత్సరాల పాటు గుర్తు ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.
 
బాల్యంలో తాను సూర్య ఐపీఎస్ షూట్ కు వెళ్లానని ఆ సమయంలో విజయశాంతి సొంత బిడ్డలా చూసుకున్నారని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. విజయశాంతి మాట్లాడుతూ ఈ స్టోరీ వినగానే ఏదో తెలియని అనుభూతి అని అన్నారు. కళ్యాణ్ రామ్ అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నారని విజయశాంతి పేర్కొన్నారు. సినిమా పూర్తైపోయిందని ఇకపై మీ అందర్నీ మిస్ అవుతానని విజయశాంతి చెప్పుకొచ్చారు.
 
నేను ఎప్పుడూ విజయశాంతినే అని అదే పౌరుషం అదే రోషం తగ్గేదేలే అని విజయశాంతి కామెంట్లు చేశారు. విజయశాంతి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎంత వయస్సు వచ్చినా అంతే స్ట్రాంగ్, క్రమశిక్షణతో ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు. నా తల్లీదండ్రులు క్రమశిక్షణగా పెంచడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని విజయశాంతి తెలిపారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. విజయశాంతి భారీ విజయాలను సొంతం చేసుకుని కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: