బాబాయ్ మాటలను ఫాలో అవుతున్న అబ్బాయ్.. ఆ పని చేయడానికి గ్రీన్ సిగ్నల్..!?

frame బాబాయ్ మాటలను ఫాలో అవుతున్న అబ్బాయ్.. ఆ పని చేయడానికి గ్రీన్ సిగ్నల్..!?

Thota Jaya Madhuri
రామ్ చరణ్ కి ఫేవరెట్ ఎవరు అంటే నాన్న - బాబాయ్ అని అడిగితే.. ముఖ్యంగా నాన్న పేరు చెప్తారు . కానీ రామ్ చరణ్ ఎక్కువగా ఇష్టపడేది బాబాయ్ నే. పవన్  వెళ్లే విధానాన్ని చరణ్ లైక్ చేస్తారు. పవన్ కళ్యాణ్ చాలా మొండివాడు . తాను అనుకున్నది ఎలాగైనా సాధిస్తాడు . ఎంత కఠిన శ్రమ అయినా దాని కోసం పడతాడు . పొలిటికల్ హిస్టరీలోనే గేమ్ ఛేంజర్ గా మారిపోయి.. ఏపీలో కూటమిని ప్రభుత్వం చేపట్టే దిశగా ఎలా మార్చాడు అనే విషయం అందరికీ తెలిసిందే .


అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ఫాలో అవుతున్నాడు రామ్ చరణ్ అంటూ మాట్లాడుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఆయన సినిమాలోని కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి . యంగ్ ఏజ్ వాళ్లని ఎక్కువగా ఆ డైలాగ్స్ ను తమ లైఫ్ లో అప్లికేబుల్ చేసుకుంటూ ఉంటారు.  గబ్బర్ సింగ్ సినిమాలో "నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను" అంటూ ఒక డైలాగ్ చెప్తాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ని చరణ్ ఫాలో అవుతున్నాడు .


అందరిలా ట్రెండ్ ఫాలో అవ్వను నేను ట్రెండ్ సెట్ చేస్తాను అంటూ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ స్టార్ హీరో తీసుకోనటువంటి డెసిషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోస్ ఒక్కొక్క సినిమా కి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతూ ఉంటారు . కానీ రామ్ చరణ్ మాత్రం తన కెరియర్ లో ఫస్ట్ టైం షాకింగ్ డేసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది . రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకి హై రెమ్యూనరేషన్ అందుకున్నాడు.  అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలకి ఆయన అంతకంటే డబుల్ రెమ్యూనరేషన్ అందుకోవాలి .


కానీ రామ్ చరణ్ మాత్రం బుచ్చిబాబు  సినిమా కోసం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.  అంతేకాదు గేమ్ ఛేంజర్  సినిమాకి సంబంధించి కూడా రెమ్యూనరేషన్ చాలా తక్కువగా తీసుకున్నారట . దీంతో బాబాయ్ మాటలని  ఫాలో అవుతున్నాడు అబ్బాయి అంటూ మాట్లాడుతున్నారు మెగా ఫాన్స్ . ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో ఒక విధంగా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు . రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తగ్గించుకునే విధంగా సెట్ చేశాడు అంటూ మాట్లాడుతున్నారు మెగా ఫాన్స్ . ప్రెసెంట్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ రెమ్యూనరేషన్ డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: