' దివ్య భారతి ' కోసం సినిమా తీసి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత..!

frame ' దివ్య భారతి ' కోసం సినిమా తీసి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత..!

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు హీరోగా నిర్మాతగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా అసెంబ్లీ రౌడీ .. ఈ సినిమాకి బి. గోపాల్ దర్శకత్వం వహించారు .. చంద్రముఖి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన పి.వాసు కథ‌ అందించారు . పరుచూరి సోదరులు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు అందించగా కేవీ మహదేవన్ సంగీతం అందించారు .. మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు .. తమిళంలో పీ. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ సినిమాకు తెలుగులో రీమేక్ గా అసెంబ్లీ రౌడీ సినిమా తెరకెక్కింది .

శ్రీకాళహస్తిలో తీసిన అందమైన వెన్నెల లోన అనే పాటకు మోహన్ బాబు చాలా ఖర్చు చేశారు .. అంతే కాదు అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ ను చూసి టాలీవుడ్ షేక్ అయింది .. దీంతో మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అని పేరు పెట్టారు .. ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది హీరోయిన్ దివ్యభారతి ఈ సినిమాలో ఆమెను చూసి సినీవర్గాలు అటు ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు . తర్వాత ఇదే కాంబినేషన్లో చిట్టెమ్మ మొగుడు అనే సినిమా తీశారు ఇది తమిళ రీమేక్ .. కథ మీద అంత నమ్మకం లేకపోవడం తో మోహన్ బాబు కాకుండా పి శ్రీధర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు . జస్ట్ నిర్మాత మాత్రమే మారేడు తప్ప మిగిలిన యూనిట్‌ అందరూ సేమ్ టు సేమ్ .

అయితే అసెంబ్లీ రౌడీ లో దివ్యభారతిని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారు . చిట్టి మా మొగుడు సినిమాలో దానికి భిన్నంగా వ్యతిరేకించారు చిట్టెమ్మ పాత్రలో దివ్యభారతి బాగా నటించిన ప్రేక్షకులు చూడలేకపోయారు .. అప్పట్లో మోహన్ బాబు అండ్ టీం దివ్యభారతి కోసమే చిట్టిబాబు సినిమా తీసి నిర్మాతకు నష్టాలు తెచ్చారని టాక్‌ కూడా వినిపించింది .. ఈ సినిమాతో నిర్మాత ఆర్థికంగా చాలా నష్టపోయారు . ఇక చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ తో ఒక్కో సినిమా చేసిన దివ్యభారతి .. మోహన్ బాబుతో మాత్రం రెండు సినిమాలు చేసింది .. ఇందులో అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే చిట్టెమ్మ మొగుడు డిజాస్టర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: