
వార్నీ.. బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబోలో వచ్చే సినిమా..ఆ క్రికెటర్ బయోపికా..?
అయితే ఇప్పుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో వచ్చే సినిమా కచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్ధితి వచ్చింది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లీక్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో రామ్ చరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమా సెట్స్ నుంచి ఒక సీన్ లీక్ అయి వైరల్ గా మారింది . ఈ వీడియోలో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కనిపించాడు. దీంతో ఈ సినిమాలో రామ్ చరణ్ స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించబోతున్నాడు అంటూ మాట్లాడుతున్నారు జనాలు.
కాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది అనే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. విరాట్ కోహ్లీ పూర్తి లైఫ్ నీ చూపించే ధైర్యం ఎవరు చేయలేరు . కానీ ఆయన లైఫ్ లో ఒక్క స్పెషల్ సెగ్మెంట్ ని మాత్రం బుచ్చిబాబు సనా ఆ ఆధారంగా తీసుకొని రాంచరణ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట . సోషల్ మీడియా ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ కుషి అయిపోతున్నారు..!!