కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న తాజా మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి.ఈ సినిమాలో కళ్యాణ్రామ్ తల్లి పాత్రలో లేడీ సూపర్ స్టార్ సీనియర్ నటి విజయశాంతి నటిస్తోంది అయితే విజయశాంతి చాలా సంవత్సరాల నుండి సినిమాలకు దూరంగా ఉంటుంది.మహేష్ బాబు నటించిన సరలేరు నీకెవ్వరు సినిమాతో ఇచ్చినప్పటికీ మళ్ళీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు.కానీ ఇన్ని రోజులకు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
అంతేకాదు అదే పౌరుషం అదే రోషం తగ్గేదేలే అంటూ విజయశాంతి చెప్పిన డైలాగులు నెట్టింట్లో మార్మోగుతున్నాయి. అయితే ఈ టీజర్ అనేది ఈవెంట్లో కళ్యాణ్రామ్ విజయశాంతి గురించి మాట్లాడుతూ.. నేను విజయశాంతి గారిని అమ్మ అనే పిలుస్తాను.మా అమ్మతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అలాగే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొడితే గనుక నేను కచ్చితంగా మా అమ్మకి నా చేతితో స్వయంగా చేపల పులుసు వండి పెడతాను. అంతే కాదు అప్పటి వరకు నాన్ వెజ్ ముట్టనని మా అమ్మ ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది. ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాక ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కాలినడకన దర్శించుకుని ఇంటికి తిరిగి వచ్చాక నా చేత్తో స్వయంగా అమ్మకి చేపల పులుసు వండి పెడతాను.
అప్పటి వరకు అమ్మ నాన్ వెజ్ ముట్టుకోనని ఆ దేవుడికి మొక్కుకుంది అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకోచ్చారు. అయితే లైఫ్ లో ఫస్ట్ టైం విజయశాంతి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో సినిమాలపై విజయశాంతికి ఇంకా ఎలాంటి ఇష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు విజయశాంతి సినిమాలు చేస్తే తన డేడికేషన్ మొత్తం అందులోనే ఉంటుంది.ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో ఒక పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీస్ పాత్రలో విజయశాంతి కనిపించింది. మరి విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఈ సినిమాకి ఏ విధంగా ప్లస్ అవుతుంది అనేది చూడాలి