ఊహించని హీరోతో పూరీ నెక్స్ట్ సినిమా సెట్టు..?

frame ఊహించని హీరోతో పూరీ నెక్స్ట్ సినిమా సెట్టు..?

murali krishna
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది.. ఆ తరువాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్ “ తెరకెక్కించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది.. ప్రస్తుతం ఏ హీరో కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

 అయితే మ్యాచో స్టార్ గోపీచంద్‌తో పూరీ గతంలో బ్లాక్ బస్టర్ అయిన గోలీమార్ కు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. అలాగే కింగ్ నాగార్జునతో కూడా పూరీ ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు న్యూస్ వైరల్ అయింది.. కానీ అవేవి కూడా నిజం కాదని తెలుస్తుంది..ప్రస్తుతం పూరీ ఎవ్వరు ఊహించని హీరోని పట్టేశాడు. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా ఫిక్స్ అయినట్టుగా తెలిసింది.
ఇప్పటి వరకు తన కెరీర్ లో విజయ్ సేతుపతి ఎన్నో విభిన్నపాత్రలు చేశాడు. మాస్టర్, విక్రమ్ సినిమాల్లో విలన్‌గా కూడా నటించి అందరిని ఆశ్చర్య పరిచాడు...
ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతు పతి తో పూరి సినిమా అనేసరికి చాలా ఎగ్జైటింగ్‌గా మారింది.. అయితే పూరికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారనుంది. ఖచ్చితంగా పూరి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే..లేదంటే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: