యంగ్ హీరో లవర్ పై మోజు పడుతున్న సల్మాన్ ఖాన్.?

frame యంగ్ హీరో లవర్ పై మోజు పడుతున్న సల్మాన్ ఖాన్.?

Pandrala Sravanthi
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఎఫైర్ లిస్ట్ తీస్తే మామూలుగా ఉండదు.. ఆయన ఎఫైర్  లిస్టులో స్టార్ హీరోయిన్ నుండి మొదలు యంగ్ హీరోయిన్ల వరకు ఎంతో మంది ఉన్నారు.అలా సోమీ అలీ ఖాన్, ఐశ్వర్యరాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు.ఇక ఇప్పటి జనరేషన్ హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిందనే రూమర్లు ఉన్నాయి.పూజ హెగ్డే సల్మాన్ ఖాన్ కాంబోలో వచ్చిన సినిమా కారణంగా  ఈ రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ ఓ యంగ్ హీరో లవర్ పై మనసు పారేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఆ హీరో లవర్ చెప్పిన మాటలే.మరి ఇంతకీ ఆ హీరో లవర్ ఎవరయ్యా అంటే..విజయ్ దేవరకొండ లవర్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో రష్మిక సికిందర్ మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. 

మురగదాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా రంజాన్ కానుకగా విడుదల కాబోతోంది.అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లో సల్మాన్ గారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు అంటూ తాజాగా రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రష్మిక మాట్లాడుతూ.. సల్మాన్ గారు అంత పెద్ద నటుడు అయినప్పటికీ కూడా ఆయన ఎంతో బాగా కలిసి పోతారు. ఆయనకు నేను పెద్ద నటుడిని అనే గర్వం కూడా ఉండదు. నాకు ఓసారి హెల్త్ బాగోలేకపోతే ఇంటి నుండి భోజనం తెప్పించి నన్ను తినమన్నారు. ఆయనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. అంతేకాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది సల్మాన్ ఖాన్ సొంతం.

సల్మాన్ ఖాన్ గారి నటన చూసి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ రష్మిక మందన్నా సల్మాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే రష్మిక మందన్నా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు ఇక అందరూ హీరోయిన్లు అయిపోయారు సల్మాన్ కన్ను నీ మీద పడిందా.. బహుశా సల్మాన్ ఖాన్ నీ మీద మనసు పారేసుకున్నారేమో.. క్రష్ పెంచుకున్నారేమో.. అందుకే మిమ్మల్ని అంత బాగా ట్రీట్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రీసెంట్ గా హోలీ పండుగ సందర్భంగా సికిందర్ మూవీ లోని భం భం భోలే శంకర అనే పాటని రిలీజ్ చేశారు. ఈ పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: