యాంకర్ విష్ణు ప్రియ భీమినేని గురించి పరిచయం అవసరం లేదు. ఈ అందాల భామకు యూత్ లో మస్త్ క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ పోవే పొరా అనే కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకర్ గా చేసింది. ఈమె ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది ప్రేక్షకులకు తెలిసింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సోషల్ మీడియా అకౌంట్ లో నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. విష్ణుప్రియ తెలుగు అమ్మాయి.
ఆ తర్వాత ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక విష్ణు ప్రియ, పృథ్వీరాజ్ శెట్టి లవ్ స్టోరీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్ లో లవ్ బర్డ్స్ అంటే వీరిద్దరే గుర్తొస్తారు. ఇటీవల విష్ణుప్రియ ఒక మాస్ సాంగ్ కూడా చేసింది. అయితే ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చాలా చేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ని ఎక్కువగా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు.
ఇక తాజాగా ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన 11 మంది సెలబ్రిటీలపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అయితే ఆ సెలబ్రిటీల ఎవరనేది.. వారిపై నమోదైన కేసు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లలో యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, యూట్యూబర్ టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరిపైన 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act- 2008 సెక్షన్ ల కింద కేసు నమోదు అయ్యిందని సమాచారం.