పెళ్లి చూపులు టూ కోర్ట్.. ప్రియదర్శి కమెడియన్ కాదు యాక్టర్!

frame పెళ్లి చూపులు టూ కోర్ట్.. ప్రియదర్శి కమెడియన్ కాదు యాక్టర్!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రియదర్శి పెళ్లి చూపులు సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో కనిపించాడు. అయితే మొదట ఇతను కమెడియన్ గా నటించిన.. తర్వాత మంచి మంచి పాత్రలు పోషించాడు. మల్లేశం సినిమా ద్వారా ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయ్యాడు. జాతిరత్నాలు సినిమా చేసి అభిమానుల ఆదరణ పొందాడు. బలగం సినిమాతో ముఖ్యపాత్రలో ఎంట్రీ ఇచ్చి మనసులను దోచుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి కోర్ట్ సినిమాలో నటించి అందరినీ కట్టిపడేశాడు.

 
అయితే ప్రియదర్శి మొదట్లో కమోడియన్ పాత్రలలో కనిపించిన.. అతను ఎప్పుడు తాను యాక్టర్ అనే చెప్పుకునేవాడు. ప్రస్తుతం ప్రియదర్శి తన మాటను నిలబెట్టుకున్నాడు. అతను నటిస్తున్న ప్రతి పాత్రకు ప్రాణం పోస్తున్నాడు. ప్రియదర్శి కేవలం కమోడియన్ కాదు అతను ఆల్ రౌండర్ అని నిరూపించుకున్నాడు. దర్శి సినిమా సెలెక్షన్ కి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రియదర్శికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 
ఇటీవలే ప్రియదర్శి, టాలీవుడ్ స్టార్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో రోషన్, శ్రీ దేవి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే నటుడు ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ సహాయక పాత్రలను పోషించారు. కోర్ట్ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చితే.. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో లాయర్ కి అసిస్టెంట్ గా తేజ అనే పాత్రలో ప్రియదర్శి నటిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: