18 ఏళ్ల జగడం.. స్టార్ట్ కావడం వెనక జరిగిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..?

frame 18 ఏళ్ల జగడం.. స్టార్ట్ కావడం వెనక జరిగిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని హీరోగా సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం జగడం అనే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం , దేవదాసు వంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత రామ్ పోతినేని హీరో గా రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ 2007 వ సంవత్సరం మార్చి 16 వ తేదీన థియేటర్లో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయ్యి ఈ సంవత్సరం మార్చి 16 వ తేదీతో 18 ఏళ్లు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... మా బ్యానర్లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఆర్య మూవీ ని రూపొందించాం. అది బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నేను రెండవ సినిమా చేయాల్సింది. అందులో భాగంగా సుకుమార్ "జగడం" కథను వినిపించాడు. అందులో నాకు ఏదో తేడా అనిపించింది. అల్లు అర్జున్ కి కూడా అలాగే అనిపించింది.

దానితో అందులో అనేక మార్పులు , చేర్పులు చేయాలి అని నేను సూచించాను. కానీ సుకుమార్ దానికి ఒప్పుకోలేదు. ఒక దశకు వెళ్లాక మా ఇద్దరి మధ్య గొడవ అయ్యేలా కనిపించింది. దానితో సుకుమార్ మీరు సినిమా చేస్తారా ... లేక వేరే ప్రొడ్యూసర్ తో ముందుకు వెళ్ళమంటారా అన్నాడు. తదుపరి రోజే సినిమా సెట్ చేసుకున్నాడు. ఆ సినిమా లాంచింగ్ కి నేను అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా కూడా వెళ్ళాము అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: