కొన్ని సంవత్సరాల క్రితం మూవీ బృందం వారు సినిమాను రెడీ చేశాక పర్వాలేదు అనే స్థాయిలో ప్రచారాలను చేసి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేవారు. మహా అయితే ఒక పెద్ద ఆడియో ఫంక్షన్ ను ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత సినిమా విడుదల అయ్యేది. ఇక అలా పెద్దగా ప్రచారాలు లేకుండా విడుదల అయిన అనేక సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ లేకపోయినా ఏం ఎఫెక్ట్ కావడం లేదు. కానీ చిన్న హీరోల సినిమాలకు , మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మాత్రం పబ్లిసిటీ అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది.
పబ్లిసిటీ హెవీగా చేయనట్లయితే సినిమా వచ్చిందా .. రాలేదా అనేది కూడా జనాలకి తెలియకుండా మూవీలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. దానితో చిన్న హీరోలు , మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలకు పబ్లిసిటీ అనేది ప్రధాన అంశంగా మారిపోయింది. ఇకపోతే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నితిన్ , వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను అద్భుతమైన రీతిలో నిర్వహిస్తూ వస్తున్నారు.
తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించి కూడా అదిరిపోయే రేంజ్ ప్రమోషన్లను నిర్వహించింది. ఈ మూవీ హీరో అయినటువంటి నితిన్ , దర్శకుడు అయినటువంటి వెంకీ కుడుముల ఒక ఫన్నీ వీడియోను విడుదల చేస్తూ ఈ మూవీ యొక్క ట్రైలర్ను మార్చి 21 వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.