టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే దర్శకుడిగా సక్సెస్ అయిన వారిలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన డాన్ శీను అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి.
ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభం నుండి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను రూపొందిస్తూ వస్తున్నాడు. అలాంటి సినిమాలతోనే ఈయనకు విజయాలు కూడా దక్కాయి. ఆఖరుగా ఈయన నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు సన్ని డియోల్ హీరోగా రూపొందుతున్న జాట్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా ఈ దర్శకుడు అత్యంత భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదల తేదీని మరియు వేదికను ఖరారు చేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మార్చి 22 వ తేదీన జైపూర్ లోని విద్యాధర్ నగర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.