తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్ గా కెరియర్ను మొదలు పెట్టి ప్రస్తుతం హీరో గా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో ప్రియదర్శి ఒకరు . ఈయన పెళ్లి చూపులు సినిమాలో కామెడీయన్ పాత్రలో నటిం చి ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు . ఆ తర్వాత ఈయనకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి . వాటిలో చాలా మూవీలతో ఈయన మంచి విజయాలను అందుకున్నాడు . ఇకపోతే హీరోగా కూడా ఈయన అనేక సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. కొంత కాలం క్రితం ప్రియదర్శిని "బలగం" సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ప్రియదర్శి తాజాగా కోర్టు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ప్రస్తుతం ప్రియదర్శి "సారంగపాణి జాతకం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఏప్రిల్ 18 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కోర్టు మూవీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించడంతో సారంగపాణి జాతకం సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశం చాలా వరకు ఉంది.
మరి ఈ సినిమాతో కూడా ప్రియదర్శి మంచి విజయాన్ని అందుకున్నట్లయితే ఈయన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో మరింతగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాతో ప్రియదర్శి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.