అల్లు అర్జున్ నరకం చూపించాడు.. అతన్ని వదలా.. కొరియోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్.?

frame అల్లు అర్జున్ నరకం చూపించాడు.. అతన్ని వదలా.. కొరియోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్.?

Pandrala Sravanthi
ఏంటి కొరియోగ్రాఫర్ కి నిజంగానే అల్లు అర్జున్ నరకం చూపించాడా.. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదా.. ఎందుకు అల్లు అర్జున్ అంత కఠినంగా ప్రవర్తించాడు.. ఇంతకీ అల్లు అర్జున్ వల్ల ఇబ్బంది పడిన ఆ కొరియోగ్రాఫర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అర్జున్ గత కొద్దిరోజుల నుండి ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నారో చెప్పనక్కర్లేదు.పుష్ప టు విడుదలై ఇండియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ ఆయన్ని మాత్రం వివాదాలు చుట్టుముట్టాయి. ఓవైపు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అన్న ఆనందం మరోవైపు వివాదాలు..దాంతో అల్లు అర్జున్ కి నిద్రతో పాటు హ్యాపీనెస్ కూడా కరువైపోయాయి. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్న అల్లు అర్జున్ గురించి తాజాగా కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరయ్యా అంటే గణేష్  మాస్టర్.. 

పుష్పటు సినిమాలోని గంగో రేణుక తల్లి,సూసకి అగ్గి రవ్వమాదిరి వంటి పాటలకి కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఎంత మంచి డెడికేషన్ పెట్టి ఎంత మంచి స్టెప్పులు అందించారో చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా ఈ రెండు పాటలు నెట్టింట్లో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇక గంగో రేణుక తల్లి అనే పాట కోసం అల్లు అర్జున్ ఎంత హార్డ్ వర్క్ చేసారో చెప్పనక్కర్లేదు. అయితే ఈ పాట పూర్తి చేయడం కోసం దాదాపు 29 రోజులు పట్టిందట. 29 రోజులు సమయం తీసుకున్న కూడా అల్లు అర్జున్ ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లు కాలికి దెబ్బ తగిలినా కూడా షూటింగ్ కి ఆటంకం కలకూడదు అనే ఉద్దేశంతో కాలికి కట్టు కట్టుకొని ఈ పాట పూర్తి చేశారట.అయితే ఈ విషయం గురించి తాజాగా గణేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ చాలా హార్డ్ వర్కర్.ఈయన గంగో రేణుక తల్లి పాట కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు.

ముఖ్యంగా ఈ పాట అంత హిట్ అయింది అంటే ఆ క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ కే ఇవ్వాలి. ఇక గంగో రేణుక తల్లి అనే పాట చిత్రీకరణ సమయంలో షూటింగ్ సెట్లో ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి.అయినా కూడా బన్నీ అస్సలు వెనక్కి తగ్గలేదు. పాటని కంటిన్యూస్ గా షూటింగ్ చేయడం కోసం ఎంతో ఇబ్బంది పెట్టాడు. ఆయన కాలికి దెబ్బ తగిలిన మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఈ పాట చిత్రీకరణ ఎలాగైనా పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టి మరీ మాకు కూడా నరకం చూపించాడు. ఇక అల్లు అర్జున్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఈ రెండు సినిమాల కోసం ఆయన దాదాపు 5 సంవత్సరాలు కేటాయించారు అంటూ గణేష్ మాస్టర్ అల్లు అర్జున్ డెడికేషన్ కి ఫీదా అవుతూ ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప, పుష్పటు రెండు మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాగే 2028 వరకు పుష్ప-3 సినిమా విడుదలవుతుందని కూడా రీసెంట్గా కొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అయ్యాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: