
తెలుగు హీరోయిన్ తో నిర్మాత ఎఫైర్ ?
ఈ బ్యూటీకి తెలుగులో కన్నా కోలీవుడ్ లోనే అధికంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంజలి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా రాజోలు అమ్మాయి. రాజమహేంద్రవరంలో చదువు పూర్తి చేసుకుని అనంతరం తమిళనాడుకు వెళ్లి అక్కడ సినిమాలలోకి హీరోయిన్గా పరిచయమైంది. కాగా, ఈ చిన్న దానికి తెలుగులో కన్నా తమిళంలోనే అధికంగా క్రేజ్ వచ్చింది. అనంతరం ఈ చిన్నది తెలుగులో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ రాణిస్తోంది.
ఇక ఈ చిన్నది తెలుగులో కన్నా తమిళంలోనే పాపులర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ అగ్ర హీరోయిన్ గా తమిళంలో రాణిస్తోంది. ఇక ఈ చిన్నది తెలుగులో రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రస్తుతం అంజలి తెలుగులో కొన్ని సినిమాలలో అవకాశాలను అందుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.
అయితే ప్రస్తుతం ఈ చిన్న దానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. నటి అంజలి తమిళంలో ఓ నిర్మాతతో ఎఫైర్ పెట్టుకుందట. చాలా కాలం నుంచి వీరిద్దరూ వారి రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల ప్రచారాలు సాగుతున్నాయి. మరి అంజలి ఆ నిర్మాతను వివాహం చేసుకుంటుందా లేదా అనే సందేహంలో చాలా మంది ఉన్నారు. ఇక ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వార్తలపై నటి అంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి.