3 రోజుల్లో 5 క్రేజీ మూవీలు.. కాస్త తేడా కొట్టిన సినిమా పని అంతే..?

frame 3 రోజుల్లో 5 క్రేజీ మూవీలు.. కాస్త తేడా కొట్టిన సినిమా పని అంతే..?

Pulgam Srinivas
ఈ సంవత్సరం మార్చి నెలలో కేవలం మూడు తేదీల్లోనే ఐదు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కానున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సంవత్సరం మార్చి 27 వ తేదీన మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఎంపూరాన్ అనే సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఇదే తేదీన తమిళ నటుడు విక్రమ్ హీరోగా రూపొందిన వీర ధీర శూర అనే సినిమాను కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక మార్చి 28 వ తేదీన మ్యాడ్ స్క్వేర్ మూవీ ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే మ్యాడ్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో మ్యాడ్ స్క్వేర్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే మార్చి 28 వ తేదీనే నితిన్ హీరో గా శ్రీ లీల హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా సికిందర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... ఏ ఆర్ మురగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా ఈ సంవత్సరం మార్చి నెలలో ఏకంగా మూడు తేదీల్లోనే ఐదు క్రేజీ సినిమాలు విడుదల కానున్నాయి. మరి ఈ ఐదు సినిమాల్లో ఏ సినిమా అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: