
కోట్లాదిమంది ఫ్యాన్స్ కోరిక నెరవేర్చబోతున్న రష్మిక.. వెయ్యండ్రా విజిల్స్..!
తనకు నచ్చింది చేయాలి అనుకుంటుంది . నచ్చకపోతే చేయకూడదు అనుకుంటుంది. అలాంటి క్యారెక్టర్ నేషనల్ క్రష్ హీరోయిన్ రష్మిక మందన్నాది . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండను ఆమె లవ్ చేస్తుంది అన్న విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతూ ఉంటుంది . కానీ రష్మిక మందన మాత్రం విజయ్ దేవరకొండ విషయంలో జరిగే ట్రోలింగ్ పై ఏ విధంగా స్పందించదు. కాగా రీసెంట్ గానే బ్యాక్ టు బ్యాక్ మూడు బడా హిట్స్ రష్మిక మందన్నా ఖాతాలో వేసుకుంది.
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో తన పేరు మరొకసారి మారుమ్రోగిపోయే విధంగా నిర్ణయం తీసుకుంది అంటూ ఓ న్యుస్ బాగా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నా పేరు ఎంత వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. బడా బడా సినిమాలలో అవకాశాలు అందుకొని సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అటువంటి రష్మిక మందన్నా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందట. స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్ లో కనిపించడం సర్వసాధారణం . కానీ కెరియర్ పీక్స్ లో ఉండగానే రష్మిక మందన్నా ఇలాంటి డెసిషన్ తీసుకుంది ఎందుకు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . బహుశా బాలీవుడ్ తనకు ఎన్నో ఇచ్చింది ఆ కారణంగానే తన క్రేజ్ మరింత పెంచుకోవడానికి ఇలా చేస్తుంది అని మాట్లాడుతున్నారు జనాలు . దీనితో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది..!