20 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌కు జంటగా ఆ స్టార్ హీరోయిన్ .. అనిల్ రావిపూడి క్రేజీ కాంబో..!

frame 20 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌కు జంటగా ఆ స్టార్ హీరోయిన్ .. అనిల్ రావిపూడి క్రేజీ కాంబో..!

Amruth kumar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ విశ్వంభ‌ర‌ సినిమాలో నటిస్తున్నారు .. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈయన సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే .. ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది .. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా నటించ‌బోయే హీరోయిన్లకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది .. ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి .. అదేమిటో ఈ స్టోరీలో చూద్దాం. ఇక అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్‌ను  తన ఖాత‌లో వేసుకున్నాడు . ఇది ఒక రకంగా ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పొచ్చు .. దీంతో అదే ఉపులో చిరంజీవికి కూడా కథ చెప్పాడు అనిల్ ..

మెగాస్టార్ కూడా మరో ఆలోచన లేకుండా సినిమాకు ఓకే చెప్పాడు .. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే ముందే చిరంజీవి తో సినిమాకి చర్చలు నడిచాయి .. రిలీజ్ తర్వాత సినిమా ఓకే అయింది. ఇక ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి .. రీసెంట్ గానే తను సెంటిమెంట్ అయిన వైజాగ్ లో ఫస్టాఫ్‌ స్క్రిప్ట్ను కంప్లీట్ చేశాడు .. చిరంజీవి గ్యాంగ్ లీడర్ స్టైల్లో మూవీ ఉంటుందని చిరంజీవి పాత్ర కూడా అలానే ఉంటుందని కూడా తెలుస్తుంది .. ఆ సినిమాలో రాజా రామ్‌గా చిరు చేసిన రచ్చ‌ అంతా ఇంత‌ కాదు ఈ మూవీలోను అదే స్టైల్ లో మేనరిజంతో క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారట అనిల్ రావుపూడి . అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది ..  ఈ సినిమాలో చిరుకు జంటగా హీరోయిన్లు ఎవరునే చర్చలు నడుస్తున్నాయి అందులో భాగంగా ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి .. సీనియర్ హీరోయిన్ భూమిక అలాగే అదితి రావు హైదరి పేర్లను దర్శకుడు అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నారట.  

వీరిద్దరిలో ఒకరిని హీరోయిన్గా ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది . ఇక భూమిక తో ఇప్పటికే ఓ సినిమా చేశాడు చిరంజీవి .  జై చిరంజీవలో చిరంజీవికి భార్య‌గా నటించిన భూమిక .. ఇది 2005లో రిలీజ్ అయింది .  ఇలా కరెక్ట్ గా 20 ఏళ్ల తర్వాత మరోసారి ఈ జంట కలిసి నటించబోతుందని కూడా చెప్పవచ్చు .. ఇక అదితి రావు హైదరీ చిరుతో ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు ఆమెకి ఇది మొదట మూవీ .. మరి ఇద్దరిలో అనిల్ ఎవరిని హీరోయిన్గా ఓకే చేస్తాడు ? ఇద్దరు హీరోయిన్లని ఎంపిక చేస్తాడా అనేది వేచి చూడాలి . ఇక ఈ సినిమాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గొట్టు పాట పాడిన రమణ గోగుల మరోసారి పాట పాడబోతున్నారట .. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాని జూన్లో ప్రారంభించాలని చూస్తున్నారు .. మరి ఇది ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి కానీ ఈ ప్రాజెక్టు పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ఓ సినిమా కూడా రాబోతుంది . మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: