బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ కు ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీల నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి .. ‘కేజీఎఫ్ 2’, ‘డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లో సంజు భాయ్ నటించి అదరగొట్టాడు .. అలాగే సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’లోనూ సంజు భాయ్ విలన్ గా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది .. అలాగే ప్రభాస్ రాజాసాబ్లో ఉండనే ఉన్నాడు .. అయితే ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఈయనకు వచ్చినట్లు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చింది .
ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ సినిమా రాబోతున్న విషయం తెలిసింది .. ఇక ఈ ఉగాదికి ఈ సినిమాని లాంఛనంగా మొదలు పెట్టబోతున్నారు . అయితే ఇప్పుడు ఈ సినిమాల్లో ఒకీలక పాత్ర కోసం సంజయ్ దత్‌ను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది .. ‘రాజాసాబ్’లో ప్రభాస్ , సంజూ మధ్య మంచి రాపో ఫ్రెండ్షిప్ కుదిరిందని .. ప్రభాస్ సూచన మేరకే సంజూ ని ఈ సినిమాలో తీసుకుంటున్నారని టాక్. బాలీవుడ్ లో ఉన్న మిగిలిన నటులతో పోలిస్తే సంజయ్ చాలా కాస్ట్లీ .. తన రెమ్యూనరేషన్ హై రేంజ్ లో ఉంటుంది ..
దాంతో పాటుగా తన స్టాఫ్ ని కూడా చూసుకోవాలి నిర్మాతలకు ఇదంతా భారమే .. కాకపోతే సంజూ వల్ల హిందీ మార్కెట్ బాగా ప్లస్ అవుతుంది . అలాగే. నటించే క్యారెక్టర్ కు సినిమాకు మంచి గుర్తింపు వస్తుంది .. అందుకే సంజూ సినిమాల్లోకి తీసుకుంటున్నారని తెలుస్తుంది .. ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబోకున్న క్రేజీ మామూలుగా ఉండదు ఈ సినిమాలో సంజూ కూడా ఉంటే మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది .. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్న విషయం తెలిసిందే .. ఈ సిని మాలో హీరోయిన్గా ఇప్పటికే చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి .. ఇక త్వరలోనే ఒక పేరును ఓకే చేస్తారట .