
' హరిహర వీరమల్లు ' పై ఆశలు లేవ్... పవన్ ఫైనల్‌గా ఈ నిర్ణయం తీసుకున్నాడా ... !
టాలీవుడ్ స్టార్ హీరో ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు ఇప్పుడు మూడు వరుసగా లైన్లో ఉన్నాయి. ఇందులో హరిహర వీరమల్లు సినిమా ఆ తర్వాత సుజిత్ దర్శకత్వం లో ఓజీ సినిమా ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ మూడు సినిమా లలో ముందుగా రిలీజ్ అయ్యే సినిమా వీరమల్లు. ఈ ‘ హరిహర వీరమల్లు ’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ అటు సినిమా లతో పాటు ఇటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఈ సినిమా కు డేట్లు ఇవ్వలేక పోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే ఈ సినిమా ఈ మార్చి 28న రిలీజ్ కావాల్సింది .. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది.
పవన్ ఎన్నో సార్లు వస్తున్నా అని చెప్పి డేట్లు ఇవ్వక పోవడంతో నిర్మాతలు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు పవన్ ఈ సినిమాను ఇంకా ఆలస్యం కాకూడదని డిసైడ్ అయ్యారు. ఆయన డేట్లు ఇవ్వడం తో పాటు హరిహర వీరమల్లు సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ చివరి షెడ్యూల్ షూటింగ్ ఖమ్మంలో ప్రారంభమైనట్లు సమాచారం. ఇక ఈ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌లో పవన్ జాయిన్ అవ్వడంతో అభిమానుల్లో ఈ సినిమా పై ఆశలు మళ్లీ చిగురించాయి. ఈ చివరి షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు ను వేసవి కానుకగా మే 9న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ హరిహర వీరమల్లు సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరో .. బాలయ్య డాకూ మహారాజ్ సినిమా విలన్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. నోరా ఫతేహి, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా .. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎం. రత్నం ఈ సినిమాకు నిర్మాత.