ప్రస్తుతం ఎన్ని లవ్ స్టోరీ సినిమాలు వచ్చిన.. వింటేజ్ లవ్ స్టోరీ సినిమాలతో పోటీ పడలేవు. ఎందుకంటే అప్పటి లవ్ స్టోరీ సినిమాలలో ఉండే మ్యాజిక్ యే వేరు. ఎన్ని కొత్త సినిమాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం ఆ వింటేజ్ సినిమాలపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ సారి ఓటీటీలో ఉండే బెస్ట్ ప్రేమ కథ సినిమాలు ఏవో చూద్దాం.
అక్కినేని నాగచైతన్య, సమంతా కలిసి నటించిన ఏ మాయ చేసావె సినిమా అంటే నచ్చని వారుండారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన జీ5, అమెజాన్ ప్రైమ్ లలో అందుబాటులో ఉంది. వింటేజ్ సినిమా అంటే మొదటగా గుర్తు వచ్చేది ఆనంద్ మూవీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తీసిన ఈ అద్బుతమైన ప్రేమ కథ చిత్ర హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఒక సినిమా నుంచి ప్రేమ అంటే ఏంటో నేర్చుకోవలంటే రాజా రాణి సినిమా చూడాల్సిందే. ఈ సినిమా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ లలో ఉంది.
ఇక శర్వానంద్, నిత్య మీనన్ తెరకెక్కించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఇక ఇటీవలే వచ్చి ప్రేమంటే ఇది రా అని చూపించిన సీతారామం సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. మజిలీ మూవీ.. అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందని చూపిస్తుంది. ఈ మూవీ సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్‌లో ఉంటుంది. ఇక మరో వింటేజ్ మూవీ ఆర్య, ఈ సినిమా సన్ నెక్స్ట్‌లో అందుబాటులో ఉంది. ఇక ధనుష్, శృతి హాసన్ నటించిన ప్రేమ కథ 3 అంటే అప్పటినుండి.. ఇప్పటివరకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. త్రిష, సిద్దార్థ్ తీసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా జియో టీవీ, సన్ నెక్స్ట్‌లో ఉంది. నాని, సాయి పల్లవి నటించిన శ్యామ్‌సింగరాయ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.