
ఎప్పుడూ ప్రేమే గెలుస్తుందన్న త్రిష.. ఆమె పోస్ట్ వెనుక అంతరార్థం ఇదేనా?
ప్రస్తుతం త్రిష చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. విశ్వంభర, థగ్ లైఫ్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలలో ఆమె నటిస్తుండటం గమనార్హం. త్రిష ఉంగరం ధరించిన ఫోటోను షేర్ చేస్తూ ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందనే క్యాప్షన్ ను ఆమె జోడించారు. ఆకుపచ్చ చీర ధరించి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేయడం జరిగింది.
తన చెవికమ్మలకు మ్యాచ్ అయ్యే ఉంగరాన్ని త్రిష ధరించడం గమనార్హం. త్వరలో త్రిష నిశ్చితార్థం లేదా పెళ్లికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో త్రిష ప్రేమలో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే త్రిష మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.
త్రిష కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. త్రిష షేర్ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కు 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. త్రిష చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రిష కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. త్రిష రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. త్రిష నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.