నార్త్‌లో సల్మాన్ ' సికిందర్ ' ఇంత దారుణంగానా... ఎంత పెద్ద డిజాస్టర్ అంటే..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా మన సౌత్ ముద్దుగుమ్మ .. కన్నడ కస్తూరి రష్మిక మందన్నా హీరోయిన్ గా కోలీవుడ్ క్రేజీ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “ సికందర్ ”. ఒకప్పుడు మురుగదాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు సౌత్ ఇండియన్ సినిమా వర్గాలు .. సౌత్ ఇండియన్ సినీ ట్రేడ్ వర్గాలలో ఏ స్థాయిలో క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గజనీ సినిమా తో మురుగదాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా ఎక్కడి కో వెళ్లిపోయింది. గజనీ సినిమా టేకింగ్ కు బాలీవుడ్ మురుగదాస్ అంటేనే ఫిదా అయిపోయింది. అలాంటి మురుగదాస్ గత కొన్నేళ్ల లో తన స్థాయికి తగ్గ హిట్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా రజనీ కాంత్ తో తీసిన దర్బార్ .. అంతకు ముందు మహేష్ బాబుతో తీసిన స్పైడర్ సినిమా లు మురుగదాస్ ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేశాయి.
ఇక కాస్త గ్యాప్ తీసుకుని మరుగ దాస్ చేసిన సినిమా సికందర్. ఈ ఈద్ కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ సికందర్ సినిమా సల్మాన్ కెరీర్లో మరో డిజప్పాయింట్ సినిమాగా చరిత్రలో నిలిచి పోయింది. అసలు ఈ సినిమా చాలా పెద్ద డిజాస్టర్ అయ్యింది. కంటెంట్ పరంగా తేలి పోవడంతో సౌర్త్ లో కాదు .. అటు బాలీవుడ్ లోనూ ఈ సినిమాను పట్టించుకునే వారే లేకుండా పోయారు. మొదటి నుంచీ డల్ గా ఉందనే మాట అటుంచితే నార్త్ లో సైతం సల్మాన్ సినిమాని ఆడియెన్స్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా బాక్సాఫీస్ రిపోర్టులు చెపుతున్నాయి. హిందీలో కూడా పలు చోట్ల ఈ సినిమా చూసే వారే లేకుండా పోవడంతో థియేటర్లు సగం ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయట. దీనితో అసలు సల్మాన్ సినిమాకి ఈ పరిస్థితి ఏంటని ? చాలా మంది షాక్ అవుతున్నారు.