
కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర .. ఇప్పుడు ఇదే న్యూ ట్రెండ్..!
ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వస్తున్న కుబేర సినిమా పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి . ఇక ఈ సినిమా హిట్ అయితే ధనుష్ ఇక టాలీవుడ్ స్టార్ గా పక్కాగా ఫిక్స్ అయినట్లే .. ఇక నుంచి ధనుష్ సినిమా తెలుగులో స్ట్రెయిట్‌గా రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి .. ఇదే రూటులో శివ కార్తికేయన్ కూడా అంచులంచలుగా తెలుగులో తన స్థానం పెంచుకుంటున్నాడు .. తాజాగా అమరాన్ సినిమా ద్వారా శివకి భారీ గుర్తింపు వచ్చింది .. ఆర్మీ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు మార్కెట్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో కూడా మంచి కలెక్షన్లు అందుకుంది .
ఈ సక్సెస్ తో శివ కార్తికేయన్ తో సినిమాలు చేయాలని దర్శకులు , నిర్మాతలు కూడా రోజురోజుకు పెరుగుతున్నారు . ఇక ప్రదీప్ రంగనాథన్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. లవ్ టుడే తో యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రదీప్ .. డ్రాగన్ తో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు . ఇక ఈ సినిమా తెలుగులో విజయం సాధించడంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సహా పాలు నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాయి .. కొత్త జనరేషన్ స్టార్ డైరెక్టర్ గా తెలుగులో ప్రదీప్ కు మంచి గుర్తింపు వస్తుంది .. ఇలా మొత్తానికి ధనుష్ , శివ కార్తికేయన్ , ప్రదీప్ రంగనాథన్ లాంటి తమిళ హీరోలు ఇప్పుడు తెలుగులో తమ మార్కెట్ ను భారీగా పెంచుకొనే పనిలో ఉన్నారు .. సూర్య, కార్తి లాంటి సీనియర్లకు సరైన తెలుగు ప్రాజెక్ట్ రాకపోవటమే ఈ యంగ్ హీరోలకు ప్లస్ అయిందని కూడా చెప్పాలి .. ఇక ఈ త్రయం రాబోయే రోజుల్లో తెలుగు మార్కెట్లో ఎలా దూసుకువెళ్తారో చూడాలి .