వరుస హిట్లతో దూసుకెళ్తున్న రష్మికకి స్పీడ్ బ్రేక్
రణబీర్ కపూర్ తో కలిసిన నటించిన యనిమాల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టి.. మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రష్మిక, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ఛావా సినిమాలో నటించింది. ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అయితే ఇదిలా ఉండగా.. హిట్ లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీకి బ్రేకులు పడ్డాయి. ఈమె సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమాలో నటించింది. మంచి పాత్రలలో నటించి, మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రష్మిక.. ప్రస్తుతం సికిందర్ సినిమాలో కేవలం 40 నిమిషాలు మాత్రమే కనిపించింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసిందా అన్నట్టు ఉంది. అలాగే ఈమె చేసిన పాత్ర ఈ సినిమాకు బలహీనతగా మారింది. మంచిగా ఎదుగుతున్న టైమ్ లో ఇలాంటి పాత్ర చేయడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.