జూనియర్ ఎన్టీఆర్ ఆ తీరని కోరిక ఎప్పటికి నెరవేరుతుందో..? ఫ్యాన్స్ వెయిటింగ్..!
ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుంది . అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని కోరికను బయటపెట్టాడు . ఆ విషయం మరొకసారి వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించాడు .. ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ ను తెరపై చూపించాడు . కానీ జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏది అంటే మాత్రం "దానవీరశూరకర్ణ" సినిమాలో సీనియర్ ఎన్టీ రామారావు గారు నటించిన పాత్రలే .
అలా జూనియర్ ఎన్టీఆర్ కి కూడా నటించాలని ఉందట . తాత ప్లేస్ ను రీప్లేస్ చేసే అంత ధైర్యం లేదు కానీ ఆయనలా అట్ ఏ టైం మల్టిపుల్ రోల్స్ లో కనిపించి జనాలు చేత శభాష్ అనిపించుకుంటే చాలు అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. కనీసం తాత నటనలో 10% నటించినా కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఓపెన్‌గానే బయట పెట్టాడు . నిజమే సీనియర్ ఎన్టీ రామారావు గారి ప్లేస్ ని రీప్లేస్ చేస్తే సత్తా ఉన్న హీరో ఎవరు లేరు కానీ ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం అది కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . మరి అలాంటి రోల్ జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చే సత్తా ఉన్న డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో...???