టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తన నటన అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ సినిమా అనంతరం పూజ హెగ్డే తెలుగులో వరుసగా కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. ముఖ్యంగా అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాలో ఈ చిన్నదాని నటనకు ఎన్నో మార్కులు పడ్డాయి. ఈ సినిమా అనంతరం పూజ హెగ్డేకు వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు వస్తాయని ప్రతి ఒక్కరు భావించారు. కానీ పూజ హెగ్డేకు తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఏవో కొన్ని సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోయినప్పటికీ ఆ సినిమాలేవి పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. అనంతరం ఈ చిన్నది బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళింది. అక్కడ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది.
ఇదిలా ఉండగా.... ప్రస్తుతం పూజ హెగ్డేకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. తెలుగులో పూజ హెగ్డే కు వరుసగా అవకాశాలు వచ్చే సమయంలో ఓ మిస్టేక్ జరిగిందట. అయితే గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా మొదట పూజ హెగ్డేను తీసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు చివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలను పెట్టి తీశారు. పూజ హెగ్డేను సినిమా నుంచి తొలగించడంతో అప్పటినుంచి ఈ చిన్న దానికి తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు రావడం లేదట.
ఏ కారణం చేత గుంటూరు కారం సినిమాలో ఈ చిన్నదానిని తప్పించారో తెలియదు కానీ ఈ సినిమా వల్ల పూజ హెగ్డే కెరీర్ క్లోజ్ అయిందని అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ బాబు సరసన పూజ హెగ్డే సెట్ కాదనే కారణం చేతనే ఈ సినిమాలో హీరోయిన్ గా తొలగించారని మహేష్ బాబు వల్లనే పూజ హెగ్డే కెరీర్ క్లోజ్ అయింది అంటూ తన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.