స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరో స్టార్ హీరోగా తన హవాను కొనసాగిస్తున్నాడు. పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ హీరో పుష్ప-2 సినిమాతో మరోసారి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను కోలీవుడ్ దర్శకుడు అట్లీతో తీయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులను చిత్ర బృందం ప్రారంభిస్తున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని డైరెక్టర్ అట్లీ ఫిక్స్ అయ్యారట.
దీనికి సంబంధించి అట్లీ ఇప్పటికే ఆ హీరోయిన్ తో కలిసి చర్చలు జరిపినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా అనుకుంటున్నారట. అల్లు అర్జున్, ప్రియాంక చోప్రా, అట్లీ కాంబినేషన్లో సినిమా వచ్చినట్లయితే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని వారు భావిస్తున్నారట. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ బాలీవుడ్, హాలీవుడ్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని అట్లీ నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఈ బ్యూటీకి దాదాపు 20 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఈ బ్యూటీ ఒక్కో సినిమాలో నటించడానికి దాదాపు 20 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా చేయడానికి ఈ చిన్నది ఏ మేరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందో చూడాలి.