
OG: అన్ని కోట్లకు..ఓటీటి హక్కుల సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్..!
అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కడికి వెళ్లినా ఓజి ఓజి అంటూ పిలుస్తూ ఉంటారు. దీంతో ఓజి సినిమాకి ఆడియో రైట్స్ నుంచి మొదలు ఓటిటి రైట్స్ వరకు అన్నీ కూడా భారీగానే డిమాండ్ ఏర్పడ్డాయి. ఈ సినిమా పూర్తి కాకముందే థియేట్రికల్ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీపడుతున్నాయి.ముఖ్యంగా ఓటీటి సంస్థలు కూడా భారీగానే పోటీ పడుతున్నారట. నెట్ ఫ్లిక్ ఏకంగా 100 కోట్లకు ఈ సినిమా రైట్స్ ని తీసుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓజి సినిమా డిమాండ్ అని క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది..ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కి కనుక డేట్లు ఇస్తే దసరాకి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబడుతుందని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ముంబై మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తూ ఉన్నది.