
తారక్ రిజెక్ట్ చేసిన మూవీల లిస్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే.. అన్ని బ్లాక్‌బస్టర్లే..?
మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం భద్ర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథను మొదట బోయపాటి , తారక్ కి వినిపించాడట. ఆయన మాత్రం ఆ కథను రిజెక్ట్ చేశాడట. ఇక ఆ సినిమాలో రవితేజ హీరోగా నటించగా ... ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు అనే సినిమా రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కథను భాస్కర్ మొదట తారక్ కి వినిపించాడట. కథ మొత్తం విన్న ఆయన సినిమా స్టోరీ బాగానే ఉంది కానీ నాపై ఈ కథ వర్కౌట్ కాదు అని ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడట.