బ‌న్నీ - అట్లీ సినిమాలో ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్లు.. కెవ్వు కేకే...!

frame బ‌న్నీ - అట్లీ సినిమాలో ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్లు.. కెవ్వు కేకే...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

‘ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ అట్లీ ’ సినిమా ఎప్పుడు ప్రారంభ మ‌వుతుంది ..ఈ సినిమా నుంచి అప్ డేట్లు ఎప్పుడు వ‌స్తూ ఉంటాయి ? ఇక సినిమా లో హీరోయిన్లు ఎవ‌రు ? ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పుష్ప 1 - పుష్ప 2 సినిమా ల‌తో బ‌న్నీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ హీరో అయిపోయాడు. అటు అట్లీ కూడా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో జ‌వాన్ సినిమా తీసి పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్ట‌డంతో అట్లీ క్రేజ్ కూడా దేశ వ్యాప్తంగా మామూలుగా లేదు. దీంతో ఇప్పుడు బ‌న్నీ - అట్లీ సినిమా అంటేనే అంచ‌నాలు తారా స్థాయిలో ఉన్నాయి.


ఈ క్ర‌మంలో నే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ బ‌య‌ట‌కు వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని టాక్ బ‌య‌ట‌కు వచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా లో ఒకే హీరోయిన్ ఉంటార‌ని .. ఆమె బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ అని అంద‌రూ అనుకున్నారు. ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్ర‌కారం జాన్వీ క‌పూర్ తో పాటు మ‌రో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతుందని తెలుస్తోంది. బన్నీ సరసన కియారా అద్వానీ అంటే.. కాంబినేషన్ మామూలుగా ఉండ‌దు. కియారా కు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు.


ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడట‌. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథ న‌డుస్తుంద‌ట‌. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉందంటున్నారు. ఏదేమైనా బన్నీ – అట్లీ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని టాక్ ? బ‌న్నీ - త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: