
రూ. కోట్లు వస్తున్న పక్కన పెట్టేశాను: సామ్
అయితే ఈ అందాల భామ ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సామ్ అంటే ఇష్టపడని వారుండారు. ఈమె గతంలో అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వాళ్ల వీరిద్దరూ విడిపోయారు. ఇటీవలే నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సామ్ ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో.. ఇప్పుడిప్పుడే సినిమాలలోకి వస్తుంది. ఇప్పుడు సమంత సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నేను ఇండస్ట్రీలో 20 ఏళ్లు ఉన్నప్పుడు అడుగుపెట్టాను. మొదట్లో చాలా బ్రాండ్స్ కి ప్రకటన కర్తగా చేశాను. కానీ ఇప్పుడు చాలా నేర్చుకున్నాను. ప్రమోట్ చేసేటప్పుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకున్నాను. కోట్లలో డబ్బు ఇస్తానని వచ్చినప్పటికీ నేను పక్కన పెట్టేశాను. గడిచిన ఏడాదిలోనే సుమారు 15 బ్రాండ్స్ వదులుకున్నా. దేనినైనా ప్రమోట్ చేయాలి అనుకుంటే.. ముందుగా ముగ్గురు వైద్యులతో చర్చించి తరువాత నిర్ణయించుకుంటా' అని చెప్పుకొచ్చింది.