మ్యాన్ ఆఫ్ మాసెస్
ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్
ఇండియా మూవీ “దేవర”..
టాలీవుడ్ మాస్
డైరెక్టర్ కొరటాల
శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్
మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో
ఎన్టీఆర్ సరసన
బాలీవుడ్ హాట్
బ్యూటీ జాన్వీ కపూర్
హీరోయిన్ గా నటించింది.. అలాగే
బాలీవుడ్ స్టార్
సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ
సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే
ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ
సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం
ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్
హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను
అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.దేవర సినిమా
విడుదల కాక ముందు నుంచే వార్ 2 సినిమా షూటింగ్ మొదలు అయ్యింది.
భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా
ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో
ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను యశ్
రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది....వార్ 2 సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ
సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో
ఎన్టీఆర్ ఇంట్రోడక్షన్ అదిరిపోతుందని సమాచారం.
ఎన్టీఆర్ ఇంట్రోడక్షన్ భారీ ఫైట్ తో స్టార్ట్ కానుందట..
ఎన్టీఆర్ దాదాపు 10 నుంచి 20 నిమిషాల పాటు సిక్స్ ప్యాక్ తో కనిపించునున్నాడు..ఈ ఫైట్ సీన్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది..