తమన్నా మొహానికి ఆ పాత్ర సెట్ అవ్వలేదు.. ఓదెల-2 పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.?

frame తమన్నా మొహానికి ఆ పాత్ర సెట్ అవ్వలేదు.. ఓదెల-2 పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.?

Pandrala Sravanthi
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓదెల-2 మూవీతో మరికొద్ది గంటల్లో మన ముందుకు రాబోతుంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల టు మూవీ ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమాకి నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన డైరెక్టర్ సంపత్ నంది తమన్నా గ్లామర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తమన్నా మొహానికి ఆ పాత్ర అస్సలు సెట్ అవ్వలేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ తమన్నా పై సంపత్ నంది ఎందుకు అలాంటి కామెంట్లు చేశారో ఇప్పుడు చూద్దాం.. తమన్నా నేచురల్ బ్యూటీ.. ఆమె మేకప్ వేసుకోకుండా కూడా తెల్లగానే ఉంటుంది. 


పాల మీగడ లాంటి అందంతో మిల మిలా మెరిసిపోయే తమన్నా ఎండకు వెళ్తే ఆమె చర్మం మొత్తం పింక్ కలర్ లోకి మారిపోతుందట. అయితే నాగ సాధువులు అంటే ఎప్పుడు ఎండలోనే తిరుగుతారు. కాబట్టి కచ్చితంగా వారి చర్మం ట్యాన్ పట్టిపోయి నల్లగా ఉండాలి. కానీ తమన్నా మాత్రం ఎండలోకి వెళ్తే పింక్ కలర్ లోకి మారిపోతుంది.దాంతో ఓదెల టు మూవీలో చేసే నాగసాధు పాత్ర తమన్నాకి సెట్ అవుతుందా లేదా అని డైరెక్టర్ సంపత్ నంది ఎన్నో లుక్ టెస్టులు చేశారట.అలాగే తమన్నాకి సెట్ అయ్యేలా మేకప్ షేడ్స్ కూడా మార్చినప్పటికీ ఏది కూడా అంతగా సెట్ అవ్వలేదట.


 కానీ ఆ తర్వాత ఫారిన్ నాగ సాధువులు తెల్లగానే ఉంటారు కదా అనే విషయం తెలుసుకున్న సంపత్ నంది తమన్నా ఫేస్ కి కలర్ కి గ్లామర్ అన్నింటికీ సెట్ అయ్యేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయమని డిజైనర్ నీతూ లుల్లాకు సంపత్ నంది కొన్ని రిఫరెన్స్ పిక్ లు పంపించడంతో ఆయన పంపించినట్లే డిజైనర్ నీతూ లుల్లా తమన్నాకి సెట్ అయ్యేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిందట.దాంతో తమన్నాకి ఆ పాత్ర కరెక్ట్ గా సెట్ అయిందట. అలా తమన్నా నాగ సాధు పాత్రలో సెట్ అయ్యేలా చూపించడం కోసం మేకర్స్ ఎన్నో ఇబ్బందులు పడినట్టు సంపత్ నంది తెలియజేశారు. ఇక హెబ్బా పటేల్ వశిష్ట లు ప్రధాన పాత్రలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా ఓదెల టు మూవీ వస్తోంది.ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటించగా హెబ్బా పటేల్ వశిష్టలు కీలకపాత్రల్లో చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: