రకుల్ ప్రీతిసింగ్ తల్లి కాబోతోందా.. అందుకే అలా..?

frame రకుల్ ప్రీతిసింగ్ తల్లి కాబోతోందా.. అందుకే అలా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్య సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతూ బాలీవుడ్ కి పరిమితమైంది. ఇక తన భర్త జాకీ తో కలిసి పలు సినిమాలలో నటిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది జాకిని వివాహం చేసుకున్న రకుల్ ప్రీతిసింగ్ వీరిద్దరూ మొదట పంజాబీ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోక ఆ తర్వాత వరుడు సాంప్రదాయ పద్ధతిలో వివాహాన్ని చేసుకోవడం జరిగింది.


తమ మొదటి  వివాహ వార్షికోత్సవ దినోత్సవాన్ని కూడా జరుపుకున్నారు.. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త అటు అభిమానులను ఆనందపరుస్తోంది రకుల్ ప్రీతిసింగ్, జాకీ త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ కాబోతున్నారనే విధంగా జోరుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.. కానీ అది నిజమనే అన్నట్టుగా పలువురు నెటిజన్స్ అయితే తెలియజేస్తున్నారు. రకుల్ ప్రీతిసింగ్ టైట్ ఫిట్ అండ్ గ్లామర్ దుస్తులలోనే గతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది..కానీ ఇప్పుడు ఎక్కువగా ఫుల్ కంఫర్ట్ అండ్ ఫ్రీ దుస్తులలోనే కనిపిస్తూ ఉండడం అందుకు అనుమానాల రేపేలా చేస్తోంది.


గర్భని అవ్వడం వల్లే రకుల్ ప్రీతిసింగ్ డ్రెస్సింగ్ స్టైల్ లో కూడా చేంజ్ చేసిందని పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా రకుల్ భర్త జాకీ కూడా తాను ప్రేమతో వంట చేస్తూ ఉన్నట్టుగా ఒక ఫోటోని షేర్ చేశారు. అదే సమయంలో కొంతకాలంగా కొత్త ప్రాజెక్టులకు సైతం రకుల్ ప్రీతిసింగ్ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం లేదు. దీంతో ఈమె సినిమాలకు బ్రేక్ తీసుకున్నదని విధంగా వార్తలేనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా రకుల్ ప్రీతిసింగ్ తల్లి  కాబోతోందని అందుకే ఇలా చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి రకుల్ ప్రీతిసింగ్ ప్రెగ్నెంట్ అనే వార్తలలో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: