టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత వెంకీ ఏ దర్శకుడుతో సినిమా చేస్తాడు ..? ఏ జోనర్ సినిమా చేస్తాడు అనే ఆసక్తి జనాల్లో భారీగా పెరిగిపోయింది. తాజాగా వెంకి నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... వెంకటేష్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి మూవీ ని అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ బన్నీ మాత్రం తన నెక్స్ట్ మూవీ ని అట్లీతో చేస్తున్నాడు. దానితో బన్నీ , త్రివిక్రమ్ కాంబో మూవీ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆ గ్యాప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ , వెంకటేష్ తో ఓ మూవీ చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వెంకటేష్ హీరోగా రూపొందిన నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు. ఈ రెండు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాల ద్వారా వెంకీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. మరి ఈ సారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకీ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది చూడాలి.