బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎక్కువగా సినీ వారసత్వం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మూడు తరాల నటులు ఇండస్ట్రీ లోకి వచ్చారు. ప్రస్తుతం మరో తరం కూడా ఇండస్ట్రీ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ సినిమాల్లోకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పటివరకు ఆరాధ్య బచ్చన్ , పలు ఈవెంట్స్ కుటుంబ వేడుకలు, స్కూళ్ల లో పార్టీస్ వంటి వాటిల్లోనే మనకు కనిపించింది. అయితే తాజాగా ఈమె తమ స్కూల్ ఈవెంట్ లో నిర్వహించినటు వంటి ఒక కార్యక్రమం లో మెరిసింది. స్కూల్లో ఆరాధ్య బచ్చన్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడమే కాకుండా ఎక్స్ట్రా కర్క్యులర్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంది.
అయితే తాజాగా ఆరాధ్య బచ్చన్ , షారుక్ ఖాన్ కొడుకు అబ్రమ్ తో కలిసి ఒక నాటకం లో పాల్గొంది. ఆ నాటకం లో ఆమె పర్ఫామెన్స్ చూసిన చాలామంది అద్భుతంగా నటిస్తోందని కొనియాడారు. స్టేజ్ షోలు చేస్తోంది అంటే సినిమాల్లోకి కూడా వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇది ఆ మధ్య కాలంలో టారో కార్డు రీడర్ గీతాంజలి సక్సేన మాట్లాడుతూ.. ఆరాధ్య బచ్చన్ డామినేటింగ్ పర్సనాలిటీ కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆమె సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్క స్టెప్పు వేసిన చాలు స్టార్ గా ఎదగడం ఖాయమని తెలియజేశారు.
న్యూమరాలజీ ప్రకారం .. 7,4 కాంబినేషన్ వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయని, కానీ వాటన్నింటిని దాటుకొని ఆమె విజయం వైపుకు అడుగులు వేస్తుందని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఈమె జాతకం ప్రకారం.. తెలుగు ప్రొడక్షన్ టీం లో సభ్యురాలుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈ విధంగా బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఆరాధ్య బచ్చన్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎదగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.