
తమన్ ఫస్ట్ సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? పకోడీ కూడా రాదు!
అయితే తమన్ టాలీవుడ్ హీరో బాలయ్య బాబు నటించిన 'డాకు మహారాజ్' సినిమాకు మ్యూజిక్ ని అందించారు. అలాగే రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాతో పాటుగా ఆది పినిశెట్టి నటించిన శబ్దం సినిమాకు కూడా మ్యూజిక్ అందించి అలరించారు. ఇటీవలే రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీకి కూడా సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో తమన్ బీజీగా ఉన్నాడు.
ఆయన మాట్లాడుతూ.. 'నేను నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భైరవ ద్వీపం సినిమాకి మ్యూజిక్ అందించాను. ఆ సినిమాతోనే నేను సినీ ఇండస్ట్రీలో ప్రయాణం మొదలుపెట్టాను. అప్పుడు నాకు 11 సంవత్సరాలు. ఈ సినిమాకు నేను అందించిన మ్యూజిక్ కి నాకు కేవలం రూ. 30 మాత్రమే వచ్చాయి. ఇవే నా ఫస్ట్ సినిమా రెమ్యునరేషన్' అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. దీంతో ఏంటి అంతా తక్కువ.. వాటితో పకోడీ కూడా రాదు అని అందరూ ఆశ్చర్యపోయారు.