
దిల్ రాజు ముందుచూపు బాగుంది .. ఎక్కడో కొడుతుంది బాసు..?
స్క్రిప్ట్ రైటింగ్ కథ తాలుక ఫ్రీ విజువలైజేషన్ అలాగే ఎడిటింగ్ లో కొన్ని టూల్స్ ని అభివృద్ధి చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు . ఇక్కడ సరిగ్గా వాడుకోవాలే కానీ ఎఐ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది . ప్రధానంగా స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో దీని పరిధి ఎంతో ఎక్కువ .. ఒక ఐడియా ని డెవలప్ చేయడానికి గతంలో పదిమంది రైటర్స్ కూర్చుని 10 రకాల ఆలోచనలు చేసేవారు .. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ టెక్నికల్ టూల్స్ లో ఐడియాని ఇస్తే అదే 10 రకాల ఆలోచనలు నిమిషాల్లో డెవలప్ చేసి ఇస్తుంది .. దానికి సరైన ఫార్మాట్లో ఇవ్వటం కూడా ఎంతో ముఖ్యం ..
ఇతర దేశాల దర్శకులు ఇప్పటికే చాలామంది ఎఐ టూల్స్ ని వాడుకుని కథలు రాస్తున్నారు .. ఇలా ఎఐని వాడుకుని కథలు తయారుచేయడం మంచి ట్రెండ్ కాదనే వాదనలు కూడా ఉన్నాయి .. అయితే ఇక్కడ ఏదేమైనాప్పటికీ మారుతున్న టెక్నాలజీ ట్రెండుకి తగ్గట్టు వెళ్ళటం కొంతవరకు మంచిది .. అయితే ఇక్కడ దిల్ రాజు ప్రయత్నం కూడా ఇదే ఉండవచ్చు . అయితే ఇప్పుడు ఎఐ డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ .. దాన్ని కొనసాగించాలంటే టేక్ కంపెనీ సంస్థలు వర్క్ చేయాల్సి ఉంటుంది .. అయితే ఇక్కడ మరి దిల్ రాజు పూర్తిస్థాయి ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో అనేది తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే .. ఆ రోజున దీనిపై మరిన్ని వివరాలు విడుదల చేయనున్నారట ..