
ఓటీటీలో కొత్త సినిమా.. ఎప్పుడంటే?
మోహన్ లాల్ హీరోగా నటించిన ఎల్ 2 ఎంపూరన్ సినిమా ఓటీటీ రానుంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ మార్చి 27న థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా దాదాపు రూ. 270 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఎల్ 2 ఎంపూరన్ సినిమా ఈ నెల 24న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
దీంతోపాటుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ ఖౌఫ్ అనే థ్రిల్లర్ సినిమా ఈ నెల 18 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీని పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ హీరో నాని నిర్మాతగా కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ కొట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతుంది.