కొన్ని సంవత్సరాల క్రితం
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల రైల్వే స్టేషన్ అనే
మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ
సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ
మూవీ ఓ టి టి లోకి వచ్చాక కొంత కాలానికి ఈ సినిమాకు కొనసాగింపుగా ఓదెలా 2 అనే
మూవీ ని రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓదెల 2
మూవీ లో
తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. ఇక ఓదెల మొదటి భాగం మంచి విజయం సాధించి ఉండడం , రెండవ భాగంలో
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఓదెల 2
మూవీ ఏప్రిల్ 17 వ తేదీన విడుదల అయింది. కానీ ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల
బాక్స్ ఆఫీస్ రాని కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
రెండు రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ
మూవీ కి నైజాం ఏరియాలో 40 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 15 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 55 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు రోజుల్లో ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.10 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక రెండు రోజుల్లో ఈ
మూవీ కి కర్ణాటక రెస్ట్ ఆఫ్
ఇండియా ఓవర్సీస్ లలో కలుపుకొని 1.35 కోట్ల షేర్ ... 2.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ
సినిమా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా ... మరో 9.65 కోట్ల రేంజ్ లో ఈ
సినిమా షేర్ కలెక్షన్లను సాధిస్తే హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. ఈ
మూవీ భారీ ఎత్తున కలెక్షన్లను సాధిస్తేనే పెద్ద ఎత్తున నష్టాలు లేకుండా బయట పడుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.