
తెలుగు క్రేజీ స్టార్స్ .. వరుస పోలీస్ సినిమాల .. జాతరే జాతర..!
ఇక రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్తో సినిమాపై అంచనాలు ఊహించిన రేజ్ కు పెరిగాయి .. నాని కూడా ఈ సినిమాతో భారీ విజయం అందుకోవాలని గట్టి ప్లాన్ తో ఉన్నాడు .. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ పరంగా హాట్ టాపిక్ గా మారింది .. ఇక హిట్ 3 మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. ఇక ఈ సినిమా తర్వాత పోలీస్ స్టోరీ తో వార్తల్లో నిలిచిన మరో హీరో రవితేజ .. మాస్ మహారాజా నటిస్తున్న లేటెస్ట్ పోలీస్ మూవీ మాస్ జాతర .. వరుస ప్లాప్‌ల్లో ఉన్న రవితేజ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు .. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ను సితార నాగవంశి నిర్మిస్తున్నారు . భాను బోగవరపు దర్శకుడుగా పరిచయమవుతున్నారు .. ఇక వీరితోపాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా మొదటిసారి పోలీస్ స్టోరీ తో రాబోతున్నాడు .. సందీప్ వంగ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న మూవీ స్పిరిట్ ఇక ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే .. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నా సినిమాలు పూర్తయిన వెంటనే సందీప్ సినిమాను కూడా మొదలుపెట్టబోతున్నాడు ..
ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా మొదటిసారి పోలీస్ స్టోరీ తో పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ కింగ్డమ్ .. సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాపై విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్నాడు .. పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో విజయ్ నటించిన ఈ మూవీ మే 30న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. వీళ్ళ దారిలోనే మాస్కా దాస్ విశ్వక్‌సేన్ కూడా మరోసారి పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు .. ఇటీవల ఆయన చేసిన సినిమాలు ప్లాప్ అవటంతో కొంత ఆలోచనలో పడిన విశ్వక్ హిట్ తరహాలో మరోసారి పోలీస్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు ..