కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్న సుకుమార్..ఒక హీరో కోసం మరొక హీరో బలి..!

Thota Jaya Madhuri
ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త కొత్త విషయాలను ఇంట్రడ్యూస్ చేయడానికి చాలామంది డైరెక్టర్ లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . మరి ముఖ్యంగా కొంతమంది పాన్ ఇండియా  డైరెక్టర్ లకే ఇలాంటి థాట్స్ వస్తూ ఉండడం గమనార్హం.  ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్గా పాపులారిటి సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ రాంచరణ్ తో తెరకెక్కించే సినిమా కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు . రామ్ చరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కంప్లీట్ అయిపోగానే వెంటనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు .



ఈ విషయంపై ఆల్మోస్ట్ మేకర్స్ కూడా అంతా రెడీగా మాట్లాడేసుకున్నారు.  కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సుకుమార్ తన సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత హైలైట్ అయ్యాలో రాసుకుంటాడో.. అదేవిధంగా హీరోయిన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ కూడా హైలెట్ అయ్యే విధంగా రాసుకుంటూ ఉంటారు . కాగా ఇప్పుడు రామ్ చరణ్ కోసం విలన్ గా మరొక స్టార్ హీరోని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ టాక్ బయటకు వచ్చింది.  సుకుమార్ - చరణ్ కి విలన్ గా రవితేజను మాట్లాడుకుంటున్నారట .



ఈ మధ్యకాలంలో రవితేజకి అసలు హిట్సే లేవు . ఇలా బిగ్ బడా డైరెక్టర్ దర్శకత్వంలో విలన్ గా నటిస్తే ఆయన కెరియర్ మరో రేంజ్ లో సెట్ అవుతుంది అని అంటున్నారు అభిమానులు . కొంతమంది మాత్రం రవితేజ విలన్ గానా..? అంటూ నెగిటివ్గా స్పందిస్తున్నారు . అయితే జగపతిబాబు కూడా ఒకప్పుడు హీరోగా నటించాడు . ఇప్పుడు విలన్ గా మారిపోయాడు.  రవితేజలోను విలన్ షేడ్స్ ఉన్నాయి అని మాట్లాడుకుంటున్న జనాలు లేకపోనూ లేదు . మరి రవితేజ ఇందుకు యాక్సెప్ట్ చేస్తాడా..? లేదా..? అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మిగిలింది . అయితే ఒక హీరో కోసం మరొక హీరోని బలి చేస్తావా సుకుమార్ అంటూ జనాలు ఫైర్ అవుతూ నిందిస్తున్నారు. మొత్తానికి సుకుమార్ కి వచ్చిన ఐడియా భలే చిక్కుల్లో పడేసేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: