పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ రూ. 170 కోట్లు?

Veldandi Saikiran
మెగా హీరో పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. పవన్ కళ్యాణ్ తనదైన నటన, ఆటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కు కోట్లాది సంఖ్యలో అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ హీరో ఓ వైపు సినిమాలో నటిస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ ప్రవేశించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను చేపట్టి తన సత్తాను చాటుతున్నారు. తన వంతు ప్రజలకు సేవ చేయాలనే తపనతో కష్టపడుతూ ఉంటాడు.


 ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం బిజీగా ఉంటున్నారు. ఎలాంటి సినిమా ప్రాజెక్టులకు ఒప్పుకోవడం లేదట. ఇదివరకే ఒప్పుకున్న మూడు నాలుగు సినిమాలను సమయం దొరికినప్పుడల్లా పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గత కొద్దిరోజుల క్రితం ఆగిపోయిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తనకు సమయం దొరికినప్పుడు ఓ వారం రోజులపాటు షూటింగ్ ను శరవేగంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ సినిమా మళ్లీ ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా ఆగిపోలేదని వచ్చే సంవత్సరం దీనికోసం పవన్ కళ్యాణ్ తన డేట్స్ కేటాయిస్తారని ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.


అయితే ఈ సినిమా ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుందని చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడానికి ఏకంగా రూ. 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఓ వార్త కొద్ది రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోలేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ వార్తపై సినిమా నిర్మాతల నుంచి ఏదో ఒక క్లారిటీ వస్తే కానీ ఈ వార్తలకు ముగింపు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: