చీర కట్టులో మైమరపిస్తున్న క్యూట్ యాంకర్.. ఈ అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో యాంకరింగ్ రంగం నుండి సినిమా రంగం లోకి అనేక మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. అలా యాంకరింగ్ రంగం నుండి సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారిలో అనసూయ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్ గా పని చేసింది. దాని ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈమె ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో సూపర్ గా సక్సెస్ కావడం , ఇందులో అనసూయ తన యాంకరింగ్ తో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈమె క్రేజ్ ఒక్క సారిగా భారీగా పెరిగింది.


దానితో ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. ఇక ఈమె కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించడం , అలాగే ఈమెకు ఆ సినిమాల్లో మంచి పాత్రలు కూడా దక్కడంతో ఈమెకు నటిగా కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఓ వైపు టీవీ షో లలో పాల్గొంటూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ అత్యంత బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే టీవీ షో లలో , సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనసూయకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో అనసూయ అదిరిపోయే లుక్ లో ఉన్న యెల్లో కలర్ శారీని కట్టుకొని , మెరూన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ చీరకట్టులో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: